
ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఎంపిక అయ్యింది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రెండవ హీరోయిన్‌గా మృణాల్ల్ ఠాకూర్ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, స్పెషల్ రోల్స్‌లో సమంత, జాన్వి కపూర్, రష్మిక మందన్న కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ భారీ కాస్ట్ లిస్ట్ మధ్యలో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త సర్‌ప్రైజ్ – శ్రీముఖి ఎంట్రీ కూడా ఉండబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అట్లీ – అల్లు అర్జున్ లు కలిసి ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం ఆలోచిస్తున్నప్పుడు, ఆ రోల్ కి సరిపడే వ్యక్తిగా శ్రీముఖి పేరు ముందుకు వచ్చిందట. “ఈ రోల్‌ని శ్రీముఖి చేస్తే బాగుంటుంది” అని ఇద్దరూ చర్చించి, చివరికి ఆమెనే ఫైనల్ చేశారని ఇండస్ట్రీ టాక్.
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత పాపులర్ యాంకర్‌గా ఉన్న శ్రీముఖి, ఈ ఆఫర్ ద్వారా తన సినీ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే పలు ఈవెంట్స్‌లో అల్లు అర్జున్‌తో ఆమె సరదాగా మాట్లాడటం.. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లపై వారి కామెడీ కనిపించడం కూడా ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. సినిమా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, డిసంబర్ నెలలోనే శ్రీముఖి తన పార్ట్ షూట్‌లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. ఆమె పాత్ర చిన్నదైనా, సినిమాలో కీలక మలుపు తిప్పే రోల్ అని సమాచారం.
అట్లీ డైరెక్షన్‌లో, అల్లు అర్జున్ నటనలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అట్లీ స్పెషల్ మేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్, రష్మిక – దీపికా – మృణాల్ గ్లామర్ టచ్ తో ఈ మూవీ 2026లో భారీ స్థాయిలో రిలీజ్ అవ్వనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇకపోతే, శ్రీముఖి ఎంట్రీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో #AlluArjun #Atlee #Sreemukhi అనే హ్యాష్‌ట్యాగ్స్ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు అయితే “ఇది శ్రీముఖికి లైఫ్ చేంజింగ్ రోల్ అవుతుంది” అంటూ ఫ్యాన్‌పేజ్‌ల్లో పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చని సమాచారం. అప్పటి వరకు ఈ వార్త మాత్రం టాలీవుడ్ సర్కిల్స్‌లో “హాట్ హాట్ టాపిక్” గా మారుమ్రోగిపోతుంది!