సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ అభిప్రాయాలను ఎలాంటి సంకోచం లేకుండా, నేరుగా స్ట్రైట్‌ఫార్వర్డ్‌గా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే, ఈ రోజుల్లో ప్రేక్షకులు ఎంత చురుగ్గా రివ్యూలను ఫాలో అవుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వేల సంఖ్యలో రివ్యూలు, కామెంట్లు, మీమ్స్ వరుసగా వస్తున్నాయి. ఇటీవల విడుదలైన “కాంతార చాప్టర్ 1” ఈ తరహా సోషల్ మీడియా హంగామాలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. హీరోయిన్ రుక్మిణి వసంత్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దైవతత్వం, పూర్వజన్మం, భక్తి, ప్రకృతి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది.


ఈ సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులు రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ నైపుణ్యాన్ని ఆకాశానికెత్తి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, అక్కడితో ఆగలేదు — కొంతమంది సినీ అభిమానులు మరియు సినీ విమర్శకులు ఇతర డైరెక్టర్లపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. “ఈ మధ్య కొంతమంది డైరెక్టర్లు కేవలం హైపర్‌ యాక్షన్‌ సీన్లు, ఫ్యాన్ బేస్‌ ఎలివేషన్లతోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు కంటెంట్‌, ఆధ్యాత్మికత, విలువలున్న కథలతో కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించవచ్చని రిషబ్ శెట్టి ప్రూవ్ చేశాడు” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మరింత ముందుకెళ్లి, “ఇలాంటి సినిమాలు మిగతా ఇండస్ట్రీ హీరోలు కూడా చేయాలి. ప్రతి భాషలో ఇలాంటి దివ్యమైన సినిమాలు రావాలి” అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో  ఇప్పుడు కాంతార చాప్టర్ 1పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.



ఇక ఈ సినిమా విజయంతో కన్నడ వర్సెస్ తెలుగు హీరోల వార్ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. కొందరు ట్రోల్స్ చేస్తూ  “మిగతా హీరోలు డమ్మీలు మాత్రమే, రిషబ్ శెట్టి లాంటి ఒరిజినల్ క్రియేటర్స్ చాలా అరుదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఈ డిబేట్ అవసరంలేదని, ప్రతి ఇండస్ట్రీకి తమదైన స్టైల్ ఉందని చెబుతున్నారు. మొత్తం మీద, కాంతార చాప్టర్ 1 కేవలం ఒక సినిమా కాదు — అది ఒక సంస్కృతిని, భక్తిని, ప్రకృతిని కలిపిన దివ్య అనుభూతి. ఈ సినిమా రిషబ్ శెట్టి కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లడమే కాదు, సోషల్ మీడియాలో ప్రేక్షకులలోనూ సినీ చర్చలను కొత్త దిశలో నడిపింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: