తన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకంగా మాట్లాడారు అనే కారణంతో కన్నీరు పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  కి కాపు ఉద్యమనేత ముద్రగడ బహిరంగ లేఖ రాసారు తాజాగా. ఈ లేఖలో ఆయన కీలక అంశాలను ప్రస్తావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది అని నాడు మా కుటుంబానికి మీరు చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.

మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నాను అని తెలిపారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పుత్రరత్నం తరచూ  పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు అని మండిపడ్డారు. రాజమండ్రి ఆసుపత్రిలో మమ్మల్ని  14 రోజులు నిర్భందించి చంద్రబాబు రాక్షసానందం పొందారు అని మండిపడ్డారు. శపథాలు ఇందిరాగాంధి, ఎన్టీఆర్, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం అని చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటిమీద రాత అని గ్రహించాలి అని ఆయన సూచించారు. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదు అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap