అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించాడు.. తనపై సోషల్ మీడియా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని అనుమానించిన ట్రంప్.. ఎట్టకేలకు సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు.. అందులో తెగ జోరు ప్రదర్శించేస్తున్నారు. ట్రంప్ నడిపిస్తున్న ‘ట్రూత్‌ సోషల్‌’కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. యాపిల్‌ స్టోర్‌లో ఇది మొదటి స్థానం సంపాదించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌ ‘ట్రూత్‌ సోషల్‌ అనూహ్యంగా సక్సస్ అయ్యింది.



ఈ ట్రూత్‌  సోషల్ మీడియాకు ఇప్పుడు మంచి సరుకు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోకి ట్రూత్ అందుబాటులోకి వచ్చి టైమ్‌లో వాడేందుకు తయారు చేసిన అప్లికేషన్‌ ఇది. ఈయాప్ అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది. స్టోర్ టాప్ చార్ట్‌లో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తోంది. వినియోగదారుల తాకిడి ఎక్కువ కావడంతో డౌన్‌లోడ్‌, వివరాల నమోదు, అకౌంట్‌ క్రియేట్‌, సైనప్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు నెట్ జీవులు తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: