రాజకీయ పార్టీల నిర్వహణకు విరాళాలే ఆధారం.. అయితే.. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి రాజకీయ పార్టీ తమకు వచ్చే విరాళాలను ఏడాదికోసారి ఈసీకి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా భారతీయ జనతాపార్టీ తనకు వచ్చిన విరాళాలపై నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం బీజేపీకి  రూ. 477కోట్ల మేరకు విరాళాలు వచ్చాయట. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీజేపీకి 477కోట్ల మేరకు విరాళాలు అందాయట. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో వచ్చిన నిధుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.


బీజేపీకి అత్యధికంగా 477 కోట్లు రాగా.. కాంగ్రెస్ కు 74.5 కోట్లు వచ్చాయని ఈసీ తెలిపింది. అంటే అధికార బీజేపీకి వచ్చిన విరాళాల్లో కాంగ్రెస్‌కు 15 శాతం మాత్రమే వచ్చాయన్నమాట. అవును మరి అధికార పార్టీ అంటే ఆ మాత్రం తేడా ఉండదా. ఈసీ నియమావళి ప్రకారం ఏటా రాజకీయ పార్టీలు తమకు వచ్చే  20వేలకు మించి అందిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP