మంచి భవిష్యత్ కోసం చాలా మంది యువత విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి ఓ శుభవార్త.. కెనడాలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట. ఈ ఒక్క ఏడాదే  కెనడా అత్యధికంగా 4.3 లక్షల మంది విదేశీయులకు ఉద్యోగాల కోసం పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉందట. అంతే కాదు.. ఈ టార్గెట్ 2024 నాటికి  4.5 లక్షలకు చేరవచ్చట.

కెనడాలో వచ్చే పదేళ్లలో దాదాపు 90 లక్షల మంది రిటైర్మెంట్‌ అవుతారట. అందువల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయట. అందులోనూ కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ఉద్యోగావకాశాల కోసం చూసే వారికి కెనడా ఓ మంచి చాయిస్ అంటున్నారు. ఇప్పుడు కెనడా వలసదారులను బాగా ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి వృత్తి నిపుణులు, సైంటిఫిక్‌-టెక్నికల్‌ సేవలు అందించేవారికి డిమాండ్ ఉందట. అలాగే  రవాణా, గోదాములు, ఫైనాన్స్‌, ఇన్యూరెన్స్‌, వినోద రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లోనూ బాగా ఉద్యోగాలు ఉన్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి:

job