టీఆర్‌ఎస్‌..బీఆర్‌ఎస్‌గా పేరు మార్పు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేరు, ఎజెండా మార్చుకోవాల్సి ఉంటుంది. పార్టీ విషయంలో ఎలాంటి మార్పులు చేసినా ఆలస్యం చేయకుండా ఈసీకి నివేదించాలని నిబంధనలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఇవాళ దిల్లీలో వాటిని నేతలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం నిన్న రాత్రి హస్తిన బయల్దేరి వెళ్ళింది. ఉదయం 11 గంటలకు ఈసీని కలిసి పార్టీ తరపున వినతిపత్రం అందిస్తారు.


సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం ప్రతిని సమర్పిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దానిని పరిశీలిస్తుంది. ఏవైనా వివరణలు అవసరమైతే సంబంధిత పార్టీ నుంచి వాటిని కోరుతుంది. ఇప్పటికే గుర్తింపు పొందిన, నమోదైన పార్టీల తరహాలోనే ప్రతిపాదిత పేరు ఉందా లేదా అన్న అంశాన్ని ఈసీ పరిశీలిస్తుంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి జాతీయ స్థాయిలో రెండు ప్రధాన పత్రికల్లో సదరు రాజకీయ పార్టీ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత విచారణ నిర్వహించి కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ నమోదు లేదా పేరు మార్పుపై నిర్ణయం తీసుకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs