ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్యం గురించి కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. కిమ్ జోంగ్ ఉన్‌ విపరీతంగా మద్యం సేవిస్తూ అనారోగ్యకరమైన జీవితం గడుపుతున్నారట. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం త్వరలో 40వ పడిలోకి  అడుగుపెడుతున్న కిమ్... తన ఆరోగ్యం గురించి తీవ్రంగా మథనపడుతున్నారట. సియోల్ కేంద్రంగా ఉత్తర కొరియా వ్యవహారాలను పరిశీలీస్తున్న డాక్టర్ చోయ్ జిన్‌వుక్  ఈ విషయం వెల్లడించారట.


విపరీతంగా మందు కొడుతున్న కిమ్‌..ఆ తర్వాత ఏడుస్తున్నారట. ఒంటరితనాన్ని, ఒత్తిడిని అనుభవిస్తున్నారని ఆ డాక్టర్ చెప్పారు. తరచూ వ్యాయామాలు చేయాలంటూ కిమ్‌  భార్య, వైద్యులు చెప్పే సూచనలను ఉత్తర కొరియా అధినేత పట్టించుకోవడం లేదట. అయితే.. కిమ్ ఆరోగ్యం గురించి ఇలా వార్తలు రావడం కొత్తేం కాదు. గతంలోనూ కిమ్ సన్నబడ్డారని, ఆయన తలకు మిస్టరీ మరకలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గతంలో వార్తలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

KIM