రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని కేసీఆర్‌ ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గళం వినిపించిన దేశపతి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఈయనకు ఈ పదవి ఎప్పటి నుంచో ఇవ్వాలని భావించినా సమీకరణాలు కుదరలేదు. కేసీఆర్ తాజాగా ఎంపిక చేసిన వీరు.. రేపు ఉదయం 11గంటలకు నామినేషన్ వేయనున్నారు.


నామినేషన్ ఏర్పాట్లు చూడాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, భారాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను వేయాలని ముగ్గురు అభ్యర్థులకు కేసీఆర్ ఆదేశించారు. గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను రేపు కేబినెట్ సమావేశంలో ఖరారు చేస్తారు. నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో.. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. నవీన్ కుమార్‌కు కేసీఆర్ మరోసారి ఛాన్స్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: