అవార్డ్స్ 2023 వేడుక చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్ స్టార్స్, టెక్నిషియన్స్‌తో పాటు, ఈ సంవత్సరం నామినేషన్లలో ఉన్న
సినిమా నటీనటులు అలాగే టెక్నికల్ టీంస్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఇండియన్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ని గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ అవ్వగా
ఇండియా నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది.అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మన
ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట
ఆస్కార్ దక్కించుకుంది.
ఇక ఇదిలా ఉంటే
అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్)
సినిమా ఆస్కార్ అవార్డుల కోత మొదలెట్టేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్.. ది వే ఆఫ్ వాటర్
సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్ ఇంకా అలాగే టాప్ గన్ మావెరిక్ సినిమాలు పోటీ పడ్డాయి.