తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు  కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఇవి వ్యక్తిగత రికార్డులు కావు. ఆయన శాఖ సాధించిన రికార్డులు. ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు చేసి తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలలు దేశంలోనే చరిత్ర సృష్టించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు.16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సగటు 69శాతంగా ఉందని.. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సగటు 30 శాతం మాత్రమే, 2022-23 నాటికి 62 శాతంతో ఇది రెట్టింపు అయిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణలో భాగంగా మాతా, శిశుసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. వైద్య, ఆరోగ్యశాఖకు అభినందనలు, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: