సాధారణంగా మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ సమస్యగా ఉండేవి మొటిమలు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా యుక్త వయస్సు వచ్చిందా అంటే అమ్మాయిలకు, అబ్బాలకు ఈ మొటిమల సమస్య విపరీతంగా ఉంటుంది. కొంత మందికి ఈ మొటిమలు విపరీతంగా రావడంతో అంద వికారంగా తయారవుతారు..అంతే కాకుండా అవి మచ్చలుగా మారి మరింత బాధకు గురిచేస్తాయి. ఇక ఈ బాధ భరించలేక చాలా మంది  మొటిమల కోసం అనేక రకాల క్రీమ్స్  ఉపయోగిస్తుంటారు.  

ఈ మొటిమల నివారణ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు. నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి. ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం. కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు సులభంగా నివారించవచ్చు :


నిమ్మకాయ మరియు పచ్చి శనగలు ఫేస్ ప్యాక్ :  ఒక స్పూన్ పచ్చి శనగల పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత కడగాలి. చర్మం పొడిగా అన్పిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ప్రతి రోజు ఈ ప్యాక్ ముఖానికి వేస్తే  మంచి పలితం కనపడుతుంది.


నిమ్మకాయ మరియు గుడ్డు తెల్లసొన ప్యాక్ : ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మూడు బాగాలుగా చేయాలి. ఈ మిశ్రమంలో ఒక బాగాన్ని ముఖానికి రాసి ఐదు నిముషాలు అయ్యాక రెండో బాగాన్ని రాసి మరో ఐదు నిముషాలు అయ్యాక మూడో బాగాన్ని రాయాలి. మూడో పొర ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.


నిమ్మకాయ రసం మరియు తేనే : ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.


నిమ్మరసం : తాజా నిమ్మరసంలో ఒక కాటన్ బాల్ ముంచి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేయాలి.  ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన మరియు మెరిసే చర్మం మన సొంతం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: