రెడ్ కలర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఎరుపురంగుకు అందంతో పాటు ఆరోగ్యంలో కూడా ప్రత్యేకత ఉంది. ఈ రంగులో ఉండే కూరగాయలు, పండ్ల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. టొమాటో, చెర్రీ, ఎర్ర జామ, ఎర్ర బొప్పాయి, ఎర్ర ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్స్, స్ట్రాబెర్రీ పండ్లు, ఇంకా ఎర్ర ముల్లంగి, ఉల్లిపాయ, మిరపకాయలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో లైకోపిన్, ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్, హెస్పరిడిన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటి వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి. కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. కీళ్ళకు బలాన్ని కూడా ఇస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: