ఇప్పుడు ఉన్న కాలుష్యాలు మరియు రసాయన వస్తువులు వాడటం వల్ల చాలా మంది ముఖం మొటిమలతో, నల్లని మచ్చలతో ఇంకా ఎన్నో ఇబందులు పడుతున్నారు.ఈ సమస్యలు పోవాలంటే మనం ఇంట్లోనే ఎన్నో చక్కటి చిట్కాలను పాటించి ముఖాన్ని కాపుడుకోవచ్చు.

 టమాటా: ఒక టమాటా తీసుకుని దానిని పేస్ట్ లాగా చేసుకుని, అందులో కొద్దిగ నిమ్మరసం పిండి, బాగా కలుపుకుని ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.


కలబంద: కలబంద వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.కలబందని చిన్న ముక్కగా కట్ చేసి గుజ్జును తీసుకోవాలి. ఆ గుజ్జును 5 నిమిషాలు ఎండలో ఎండపెట్టాలి. తరువాత అందులో కొద్దిగ నిమ్మరసాన్ని వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది,ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు తగ్గుతాయి.ఉల్లిపాయ:  ఒక ఉల్లిపాయ తీసుకుని దానిని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఆ పేస్ట్ నుంచి నీటిని వేరు చేసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే సూక్ష్మజీవ నిరోధక లక్షణాల కారణంగా ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు తగ్గుతాయి.


పసుపు మరియు నిమ్మరసం: కొంచెం పసుపు తీసుకుని దానిలో కొద్దిగ నిమ్మరసం వేసి పేస్ట్ లాగా కలిపి ముఖానికి అప్లై చేసుకుని కొద్ది సేపటి తర్వాత నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం ఎంతో కాంతి వంతంగా తయారవుతుంది,అలానే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.

ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల: ఎక్కువ నీరు తాగడం వల్ల ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి. రోజుకు సుమారు కనీసం 68 గ్లాసుల నీటిని త్రాగటం వల్ల చర్మకాంతి పెరగటమే కాకుండా శరీరం లోపల ఉన్న విష కణాలను బయటకు పంపుతుంది

పచ్చి పాలు:  పచ్చి పాలలో లాక్టిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మచ్చలను పోగొట్టి చర్మాని మృధువుగా ఉంచుతుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో కడుగుకోవాలి. ఇలా రోజూ ఉదయం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: