అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని హీరోగా, యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నాగార్జున ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.గత రాత్రి ‘లెనిన్’ సినిమా ఫస్ట్ కట్‌ను చూసిన నాగార్జున, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.“లెనిన్ సినిమా చూశాను. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. మీరు ఈ సినిమాలో ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు” అంటూ నాగ్ సాలిడ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

 అఖిల్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని, అక్కినేని వారసుడు పక్కా మాస్ హీరోగా ఈ చిత్రంతో నిలదొక్కుకుంటారని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.వరుస వాయిదాలతో నిరాశలో ఉన్న అభిమానులకు నాగార్జున బిగ్ బూస్టప్ ఇచ్చారు. “సినిమా విడుదలపై ఎటువంటి సందేహాలు వద్దు. జూన్ 26న ‘లెనిన్’ గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డేట్ మార్క్ చేసుకోండి!” అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో జూన్ నెలాఖరున బాక్సాఫీస్ వద్ద అఖిల్ అక్కినేని సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమా టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది.ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖిల్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్లు సమాచారం. కింగ్ నాగార్జునతో కలిసి సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రాబోతోంది.

యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని టాక్. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, అది అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: