ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి... చుండ్రు సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే ఈ పద్ధతులు పాటించండి. చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందండి...


*హెన్నా కుంకుడుకాయల ప్యాక్....

కావాల్సినవి పదార్ధాలు....

1.హెన్నా పొడి 4 టేబుల్ స్పూన్లు

2.కుంకుడుకాయల పొడి రెండు టేబుల్ స్పూన్లు

3.పెరుగు రెండు టేబుల్ స్పూన్లు


 తయారు చేయు విధానం....

ఒక బౌల్ లో హెన్నా పౌడర్, కుంకుడుకాయల పొడి కలిపి మిశ్రమంగా చేయాలి. దీనిలో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్  తలకు అప్లై చేసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వారానికోసారి అప్లై చేసుకోవడం ద్వారా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన కుంకుడు కాయలు.. మాడును మొత్తం శుభ్రం చేసి చుండ్రు రావడానికి కారణమైన ఫంగస్‌ను నాశనం చేస్తుంది.



*హెన్నా ఎగ్ ప్యాక్...

కావాల్సిన పదార్ధాలు...

1. హెన్నా మూడు టేబుల్ స్పూన్లు

2.ఆలివ్ నూనె టేబుల్ స్పూన్

3.విప్డ్ ఎగ్ వైట్ రెండు టేబుల్ స్పూన్లు, నీరు


తయారు చేయు విధానం.....

గిన్నెలో హెన్నా, ఆలివ్ నూనె, ఎగ్ వైట్ వేసి తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు అప్లై చేసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా  కోడిగుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.

ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి: