సూపర్‌స్టార్ రజనీకాంత్ హవా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనవసరం లేదు. రజని సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం అంటే ఏ నటికి అయినా అది ఓ పెద్ద మలుపు, అసలు కెరీర్ మార్చేసే అవకాశమే. ఇప్పుడు అలాంటి అదృష్టం దక్కింది బాలీవుడ్ నటి అపేక్ష పార్వెల్ కు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్–2’ కోసం అపేక్షను ఎంపిక చేశారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, యోగిబాబు వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ ఈ సీక్వెల్‌లో అతిథి పాత్రల్లో మరోసారి మెరవనున్నారు. ఇవన్నీ సరిపోక కొత్తగా బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి, వెర్సటైల్ యాక్టర్ ఎస్‌.జే. సూర్య కూడా ఈ పార్ట్‌లో చేరడం సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది.


అపేక్ష ప్రవేశంతో ‘జైలర్–2’లో కొత్త ఫ్లేవర్ :

ఈ భారీ కాస్ట్ మధ్య అపేక్షకు కీలక పాత్ర ఇవ్వడం, ఆమె నటనపై దర్శకుడు నెల్సన్ నమ్మకం ఉంచినట్టు చెప్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ ముంబైలో వేగంగా జరుగుతోంది. యూనిట్ సభ్యులతో కలిసి అపేక్ష కూడా నిత్యం షూటింగ్‌లో పాల్గొంటూ, తనకిచ్చిన పాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా అపేక్ష మాట్లాడుతూ—"రజనీకాంత్‌ సర్ సరసన తెరపై కనిపించడం అనేది ఏ నటి జీవితానికైనా గౌరవం. నా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇది" అని భావోద్వేగంగా తెలిపిందట.



జైలర్–2 ఆమె కెరీర్‌కి మైలు రాయి:

ఇప్పుడు రజనీకాంత్ లాంటి లెజెండ్ సరసన నటించే అవకాశం రావడం వల్ల ఆమెకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కనుంది. సినిమా స్థాయి, స్టార్ కాస్టింగ్‌ వల్ల అపేక్ష స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవల్‌లో కనిపించబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ నెల్సన్, రజనీకాంత్ మాస్ ఎంటర్టైన్మెంట్‌ను కొత్త రేంజ్‌లో చూపించబోతున్నారని తెలిపే లోపల టాక్ కూడా ఈ సినిమాపై అంచ‌నాల్ని మరింత పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: