తాజాగా ఈమె తన జిమ్ ట్రైనర్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఫిట్‌నెస్‌తో కట్టిపడేసే ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అవ్వగా, అందులో సమంత కనిపించిన విధానం, ఆమె ఫిజిక్‌ని చూసి చాలామంది నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. అయితే అందరూ అలానే స్పందించలేదు. కొంతమంది మాత్రం విమర్శలకు తెరలేపి, “అతిగా వ్యాయామం ఆరోగ్యానికి మంచిది కాదు” అంటూ నెగిటివ్ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.
సదరు నెటిజన్ చేసిన ఈ కామెంట్ పై సమంత కూడా సైలెంట్‌గా ఉండలేదు. ఎప్పుడూ తనకు సంబంధించిన విషయాల్లో స్ట్రెయిట్‌ఫార్వర్డ్‌గా స్పందించే సమంత, ఈ కామెంట్‌కు కౌంటర్‌గా “మీ సలహా అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతాను” అంటూ స్పష్టమైన రిప్లై ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.
ఇక ఆ కామెంట్‌పై నెటిజన్ల మధ్య కూడా చర్చలు మొదలయ్యాయి. కొంతమంది “సమంత మంచి కోసమే అభిమానులు సూచనలు చేస్తున్నారు, గతంలో ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్లే అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సందర్భం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి” అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను సమర్థించే వారు ఉన్నప్పటికీ, మరోవైపు పెద్ద సంఖ్యలో సమంత అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. “ఫిట్‌గా ఉండటం ఆమె నిర్ణయం, ఆమె శరీరానికే ఏం సూట్ అవుతుందో ఆమెకే తెలుసు” అంటూ సమంత తరఫున కామెంట్లు చేస్తున్నారు.
మొత్తంమీద, ఒక సింగిల్ జిమ్ ఫోటోతో మొదలైన చిన్న కామెంట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌గా మారిపోయింది. అయితే సమంత ఇచ్చిన కౌంటర్ మాత్రం అందరికీ ‘బాస్ లెవెల్ రిప్లై’గా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి