సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అయిపోతుందని ఒక సెంటిమెంట్ ఉంది. అందరు కూడా అదే నమ్ముతారు.  అయితే ఆ అభిప్రాయానికి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆమె మరింత వేగంగా ప్రాజెక్టులను సైన్ చేస్తూ, వరుసగా షూటింగ్‌లలో పాల్గొంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న కీర్తి, ఇటీవలి ఇంటర్వ్యూలో తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటనలోనే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌లో కూడా తన ఫోకస్ పెంచాలని ఆమె నిర్ణయించింది.
 

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాని బయటపెట్టింది. “నేను స్వయంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా. ఇది నాకు చాలా సంవత్సరాలుగా ఉన్న డ్రీమ్” అని చెప్పిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంటే కీర్తి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తోందన్న మాట. కంగనా రనౌత్‌లా నటిస్తూ డైరెక్ట్ కూడా చేసే లేడీ మెగాఫోన్ జోన్‌లోకి దిగేందుకు కీర్తి సీరియస్‌గా సిద్ధమవుతోందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.



అయితే నటన చేస్తూనే డైరెక్షన్‌ హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, కంగనా రనౌత్ వంటి కొద్దిమంది మాత్రమే ఈ రెండు బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు వారి లిస్ట్‌లోకి చేరేందుకే కీర్తి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.‘మహానటి’లో సావిత్రి గారి లాంటి గొప్ప నటి పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన కీర్తి, ఇప్పుడు నిజ జీవితంలో కూడా సావిత్రి గారి ప్రయాణాన్ని తలపించేలా డైరెక్షన్ వైపు అడుగులు వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ చాలా ఆసక్తికరం. నటిగా ఇప్పటికే తన ప్రతిభను రుజువు చేసుకున్న కీర్తి, డైరెక్టర్‌గా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.



ఇలా వరుస ప్రాజెక్టులు, మేకింగ్‌పై కొత్త దృష్టి, స్వయంగా రాస్తున్న స్క్రిప్ట్—ఇవి అన్నీ కలిపి కీర్తి కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “గుడ్ న్యూస్” ఇదే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: