మనం ఎప్పటి నుంచో జుట్టుకు కొబ్బరి నూనెను రాసుకుంటూ ఉంటాము. ఎందుకంటే కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఇంకా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.అలాగే కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు, తల చర్మం పొడిబారకుండా ఉంటాయి. జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. అయితే కొబ్బరి నూనెను నేరుగా రాసుకోవడానికి బదులుగా ఈ నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు రాసుకోవడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గోరు వెచ్చని కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా చుండ్రు సమస్య, వెంట్రుకల చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఈ గోరు వెచ్చని కొబ్బరి నూనెను జుట్టుకు ఎలా రాసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


దీని కోసం మన జుట్టును షాంపుతో బాగా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే జుట్టును నీటితో శుభ్రం చేయడం వల్ల నూనె జుట్టు కుదుళ్లల్లోకి సులభంగా వెళ్తుంది. జుట్టును శుభ్రం చేసిన తరువాత మన జుట్టుకు అవసరమయ్యేంత నూనెను తీసుకుని దానిని గోరు వెచ్చగా వేడి చేయాలి. ఆ తరువాత జుట్టును చిక్కులు లేకుండా చక్కగా దువ్వుకోవాలి.ఆ తరువాత గోరు వెచ్చగా చేసిన నూనెను జుట్టు కుదుళ్లల్లోకి బాగా ఇంకేలా రాస్తూ మర్దనా చేయాలి. దీనిని ఒక అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలు చాలా చక్కగా అందుతాయి. ఇంకా జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. అలాగే జుట్టు పొడిబారడం తగ్గడంతో పాటు జుట్టు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా సాధారణ కొబ్బరి నూనెకు బదులుగా గోరు వెచ్చని కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: