క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌న‌తా క‌ర్ఫ్యూతో ప్రారంభ‌మైన మోదీ ప్ర‌ణాళిక చివ‌ర‌కు 21 రోజుల పాటు లాక్‌డౌన్‌తో ప్ర‌స్తుతం కంటిన్యూ అవుతోంది. క‌రోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. ఈ లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సోమవారం స్పష్టత రానుంది. ఇక క‌రోనా కేసులు రోజు రోజుకు దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అదే టైంలో క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే లాక్‌డౌన్ పొడిగించాలంటూ ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల నుంచి మోదీకి విన‌తులు స‌మ‌ర్పించారు.

 

ఇక ఇప్ప‌టికే ఏడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న కూడా చేశారు. తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్‌లు‌గా విభజించి, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే ఆంక్షలు పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా చేయాల‌ని భావిస్తోంది. అయితే మోదీ ఈ రోజు లాక్ డౌన్ పొడిగింపుపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు.

 

అయితే ఈ గ‌డువు పెంపు ఏప్రిల్ 30తో ముగిస్తారా ?  లేదా మ‌రో 15 రోజులు అద‌నంగా అంటే మే 15 వ‌ర‌కు పొడిగిస్తారా ? అన్న టెన్ష‌న్ ఉంది. అయితే కొన్ని రంగాల‌కు మిన‌హాయింపు... కొన్నింటి విష‌యంలో మే 15 వ‌ర‌కు ఈ గ‌డువు పొడిగిస్తార‌ని తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: