వారెవ్వా చంద్ర‌బాబు నిజ‌మైన రాజ‌కీయ విజ్ఞ‌త ఉన్న నేతే అని చెప్పాలి. ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు చంద్ర‌బాబు ప‌రిస్థితుల‌ను ఎలా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాలో నిజంగా తెలిసిన వ్య‌క్తి. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మోడీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌ని చంద్ర‌బాబు మోడీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న భ‌జ‌న చేయ‌డం స్టార్ట్ చేసేశారు. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు మోదీ ప్రెస్‌మీట్ పెట్టి లాక్‌డౌన్ మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే చంద్ర‌బాబు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రెస్‌మీట్ పెట్టి మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

 

తాను రెడ్‌జోన్ల‌తో పాటు హాట్‌స్పాట్ల‌లో ఏం చేయాలో ప్ర‌ధాన‌మంత్రికి ఈ నెల 10వ తేదీన లేఖ రాశాన‌ని.. ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి మోదీతో ఫోన్లో మాట్లాడాన‌ని.. క‌రోనా క‌ట్ట‌డికి తాను ప‌లు సూచ‌న‌లు చేశాన‌ని.. చెప్పారు. ఏదేమైనా కీల‌క స‌మ‌యంలో మోదీని చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకుంటూ ఆయ‌న నిర్ణ‌యాలు స‌మ‌ర్థిస్తూ తాను నిజ‌మైన రాజ‌కీయ వేత్త‌ను అని త‌న రాజ‌కీయ విజ్ఞ‌త చాటుకుంటున్నారు. రేపో మాపో మోదీతో బాబోరికి చాలా అవ‌స‌రాలే ఉన్నాయి. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు పెద్ద‌గా రాని ఆయ‌న మోదీ ప్రెస్‌మీట్‌కు డ‌ప్పు కొట్టేందుకే ప్రెస్‌మీట్ పెట్టి మోదీ కీర్త‌న‌లు చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: