ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి 10 లక్షల జనాభాకు 961 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ టెస్టులు సరిగా చేయడం లేదనడం సరికాదన్నారు. పాజిటివ్  కేసుల సంఖ్య విషయంలో వైద్య ఆరోగ్య శాఖ  చాలా పారదర్శకతతో ఉందని.... తమ శాఖ ఇచ్చే నివేదికనే మీడియా సంస్ధలు ప్రకటించాలని ఆయన కోరారు.  కొంత  మంది పనుకట్టుకొని లేని పోని రూమర్లు సృష్టిస్తున్నారని.. కేసులను దాస్తున్నామనడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. నిజంగా కేసులను దాస్తే ఆ వ్యక్తి వల్ల ఎందరో ఎఫెక్ట్‌ అవుతారని చెప్పారు.

 

ఎవరైనా వీఐపీని గుర్తించకపోతే ఆయన సూపర్ స్ప్రెడర్‌గా మారుతాడని చెప్పారు. కర్నూలు జిల్లాలో గురువారం ఒక్కరోజే 31 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. తాజాగా  కర్నూలు జిల్లాలో నమోదైన కేసులతో జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 234కు చేరగా.. ఈరోజు ఇద్దరు వ్యక్తులు  మరణించారు. దీంతో కర్నూలు జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది.  3 లక్షల పీపీఈ కిట్లు, 45లక్షల మాస్క్‌లు, 31లక్షల గ్లౌజ్‌లు ఉన్నాయని, క్వారంటైన్‌ 14 రోజులా..28 రోజులా అనేది చూడాలని అధికారులకు సూచించారు.

 

కొన్ని కేసుల్లో 14 రోజుల్లో తర్వాత కూడా పాజిటివ్ వస్తోందని జవహర్‌రెడ్డి చెప్పారు.రాష్ట్రంలో  సరిగా కరోనా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలు సరికాదని జవహర్ రెడ్డి చెప్పారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసే రాష్ట్రంగా ఏపీ నిలిచిందని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: