రాధికా ఆఫ్టే గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు... గ‌త కొద్ది రోజులుగా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తూ బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు మ‌న తెలుగులో బాల‌య్య లెజెండ్‌, ల‌య‌న్, ర‌క్త‌చ‌రిత్ర సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె ప‌లుసార్లు బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ వ‌స్తోంది. ఇక బోల్డ్‌గా ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసే రాధిక తాను న‌గ్నంగా, బోల్డుగా న‌టించేందుకు రెడీ అని ప‌లుసార్లు చెప్పింది. ఈ క్ర‌మంలోనే న‌గ్న‌, బోల్డ్ పాత్ర‌ల కోసం ఆమెను సంప్ర‌దించే ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల సంఖ్య రోజు రోజుకు తెగ పెరిగిపోతోంద‌ట‌.

 

ఇప్ప‌టికే రాధిక అహల్య, బద్లాపూర్ వంటి చిత్రాల్లో రాధిక నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది రాధికను అలాంటి పాత్రలో కోసం సంప్రదిస్తున్నారట. ఈ క్ర‌మంలోనే రాధిక తీవ్రంగా ఫైర్ అవుతోంది. తాను న‌గ్న సీన్ల‌లోనూ, శృంగారానికి సంబంధించిన సీన్ల‌లో న‌టించేందుకు సిద్ధ‌మే అని..అయితే ద‌ర్శ‌కులు కేవ‌లం క‌థ‌లో బ‌లం లేకుండా అలాంటి పాత్ర‌ల్లోనే న‌టించాల‌ని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యింది. 

 

చెత్త బోల్డ్ క‌థ‌లు తీసుకువ‌చ్చి న్యూడ్‌గా న‌టించ‌మ‌ని అడిగితే ఎలా.. తాను కేవ‌లం సెక్స్ చేయడం కోసమే తాను ఇండస్ట్రీకి రాలేదని రాధికా ఆప్టే తెలిపింది. ఇక త‌న‌కు డ్రెస్సింగ్ విష‌యంలో దీపికా ప‌డుకునే, కంగన రనౌత్ స్టైల్ అంటే ఇష్టమని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: