దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు అధ్యయనాల్లో కరోనా బాధితుల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువని తేలింది. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు కరోనా భారీన పురుషులు ఎక్కువగా ఉండటానికి గల కారణాలను కనిపెట్టారు. కరోనాకు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ ఏసీఈ 2 అనే ఎంజైమ్ సహాయంతో మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది. 
 
ఈ ఎంజైమ్ మహిళల రక్తంతో పోలిస్తే పురుషుల రక్తంలో ఎక్కువగా ఉండటంతో పురుషులు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నట్టు తేలింది. ఆండ్రియాన్ వూర్స్ అనే శాస్త్రవేత్త ఈ విషయాలను వెల్లడించారు. సాధారణంగా ఈ ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఉంటుందని... ఊపిరితిత్తుల్లో ఈ వైరస్ ప్రవేశించడానికి ఏఈసీ 2 ఎంజైమ్ కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: