ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్న నేపధ్యంలో విద్యార్ధులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడవద్దు అని భావిస్తున్న ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులకు వాట్సాప్ పాఠాలు నేర్పాలి అని నిర్ణయం తీసుకుంది. మొత్తం 24వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు... ఈ ఆన్‌లైన్ క్లాసుల్లో చేరతారు.

 

టీచర్లు తమ క్లాస్ లు రికార్డ్ చేసి యుట్యూబ్ లో పోస్ట్ చేస్తారు. వాటి ద్వారా పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ప్రతీ స్కూలుకూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా టీచర్లను పిల్లలను యాడ్ చేస్తారు. సదరు గ్రూప్ నుంచి పాఠాలు నేర్పిస్తారు. ఇది త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: