ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆరోగ్య ఆసరా పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 2,000 రకాల వ్యాధులకు ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు. తాజాగా సీఎం జగన్ మాటాడుతూ ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని కొత్తగా అమలులోకి తీసుకొచ్చిందని... రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి వారు సొంతంగా పనులు చేసుకునే వరకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 
 
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు అన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇప్పటికే చెల్లించాలని సీఎం చెప్పారు. ఇకపై ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కావాలని సూచించారు. బిల్లులు అప్ లోడ్ అయిన వెంటనే ఆ బిల్లులను చెల్లించాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: