తమిళనాడు లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. అక్కడ లాక్ డౌన్ ని మళ్ళీ విధించే అవకాశాలు ఉన్నాయి అని ఆ రాష్ట్ర సిఎం పళని స్వామి చెప్పారు. ముందు నాలుగు జిల్లాల్లోనే లాక్ డౌన్ ఉన్నా సరే ఇక కేసులు ప్రతీ రోజు పెరుగుతూ ఉన్న నేపధ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

తాజాగా ఆయనే స్వయంగా ముందుకు వచ్చి చెప్పడం తో ఇప్పుడు ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి అక్కడ లాక్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నిన్న అక్కడ 3500 కేసులు రాగా 46 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: