ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం స్పందించారు. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ కు 7.5 రూపాయలను గత ప్రభుత్వమే నిర్ణయించింది అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. 

 

మెగా వాట్ కు 5.5 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నామని, వద్దన్నా సరే విద్యుత్ ని అంటగడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మిగిలిన రాష్ట్రాలకు రెండు లక్షల లోపే వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్టీపీసి 9.84 రూపాయలకు అందిస్తుందని ఆయన వివరించారు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపు లేకపోవడంతో రెండు వేల 500 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: