టీం  ఇండియా మాజీ క్రికెట్ దిగ్గజం అనీల్ కుంబ్లే  పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఆటగాళ్ళు ప్రస్తుత ఆటగాళ్ళు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీం ఇండియా మాజీ ఆటగాళ్ళు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలి, వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు చెప్పారు. టీం ఇండియా ప్రస్తుత కెప్టెన్... విరాట్ కోహ్లీ కూడా  విష్ చేసాడు.

తాజాగా టీం ఇండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ట్విట్టర్ లో అనీల్ కుంబ్లే కి శుభాకాంక్షలు చెప్పాడు. మానసికంగా బలం, మరియు  పట్టుదల కలిగిన వ్యక్తికి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు. ఆయన ఎప్పుడూ సవాలు నుండి దూరంగా ఉండరు అన్నాడు.  మీతో కలిసి పనిచేయడం  చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఆ సంతోషం ఎప్పటికి ఉంటుందని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: