ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడితే తాము సహించమని కూడా చెప్పారు. జేసీ కుటుంబ ఆగడాలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రేక్ పడిందని.. అది తట్టుకోలేకే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి శంకర నారాయణ విమర్శించారు. జగన్ గురించి జేసీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అనంతపురం ప్రజలు జేసీ నాలుక తెగ కోస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా జేసీ కుటుంబం తాడిపత్రిలో ఎన్నో అరాచకాలకు పాల్పడిందని.... అందుకే జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్రజలు చిత్తుగా ఓడించారని ఆయన విమర్శించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి