తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. త్వ‌ర‌లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డంతో ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ? వ‌స్తాయా  అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. అయితే ఇక్క‌డ వైసీపీ తిరుగులేని విజ‌యం సాధిస్తే జ‌న‌సేన - బీజేపీ ప‌రువు పోయింది.. ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు రాలేదు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరు పేట మున్సిపాలిటీలు కూడా వైసీపీ పరమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: