ఇప్పటికే వరుస సంచలన నిర్ణయాలతో దూసుకు వెళుతోన్న
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో జగన్ ఇప్పటికే ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 259 పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి వాటి గుర్తింపు నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో ఈ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠశాలలు వెతుక్కోవాల్సి ఉంది. వసతుల ఏర్పాటు విషయంలో ఎన్ని మార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోలేదని, అందుకే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు రద్దు చేసిన పాఠశాలల వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది.