క‌రోనా కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరిగిపోతుండ‌డంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకూ లాక్ డౌన్ ను విధించింది. అయితే పాక్షిక లాక్ డౌన్ కావడంతో కేసుల సంఖ్య తగ్గడం లేదు. మే 12వ తేదీ నుంచి కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. క‌ర్నాక‌ట‌లో స‌గ‌టున రోజుకు 45 - 50 వేల కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. బెంగ‌ళూరులో క‌రోనా దారుణంగా ఉంది. ఇక సంపూర్ణ లాక్‌డౌన్ కోసం ప్ర‌ధాని మోడీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు. పాక్షిక లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గడం లేదని యడ్యూరప్ప అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: