నోరుందిక‌దా అని ఏది మాట్లాడితే అది మాట్లాడ‌టం త‌గ‌ద‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు హిత‌వు ప‌లికారు. సినిమా టికెట్ల‌ను జీఎస్టీ ప‌రిధిలో స్ట్రీమ్‌లైన్ చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని బొత్స వివ‌రించారు. సిరిమాను ఉత్స‌వాల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రిప‌బ్లిక్ సినిమా ప్రి రిలీజ్ వేడుక సంద‌ర్భంగా ప‌వ‌న్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు కురిపించారు. దీనిపై బొత్స స్పందించారు. సినిమా టికెట్ల‌ను ఇష్టానుసారంగా పెంచేస్తామంటూ ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోవాలా? ఆన్‌లైన్ విధానం తీసుకురావాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లే అడిగార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌పై భారం వేస్తామంటూ ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని, ఏదైనా ఇబ్బందులుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌న్నారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోపాటు చాలామంది ఉన్నార‌ని, చిరంజీవి, మోహ‌న్‌బాబు లాంటి పెద్ద‌లు ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దిస్తే స‌రిపోతుంద‌న్నారు. మంత్రుల గురించి, ప్ర‌భుత్వం గురించి మాట్లాడేట‌ప్పుడు నోరు అదుపులో ఉండాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: