ప్రస్తుతం చాలా మందిపై సినిమా ప్రభావం ఎక్కువగా చూపుతున్నాయి. అందులోనూ క్రైం స్టోరీలంటే మరీ మక్కువ. సైకో టైపులో చాలా మంది.. ఈ సినిమాలు చూసి ప్రభావితం అవుతుంటారు. సినిమా తరహాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో ఓ నేరగాడు దండుపాళ్యం సినిమా టైపులో హత్య చేశాడు. అలా ఆ కదిరి దోపీడీ హత్య కేసులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. దోపీడీతోపాటు హత్య చేసి మోస్ట్ వాంటెంట్ నేరస్తుడిగా నిలిచాడు.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. దండుపాళ్యం సినిమా చూసిన ఓ నేరస్తుడు పక్కా ప్లాన్‌తో హత్య, దోపిడీకి పాల్పడ్డాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలి హత్య కేసును పోలీసులు మూడు నెలలపాటు శ్రమించి కేసును ఛేదించారు. దీని కోసం ఏకంగా 8 ప్రత్యేక బృందాలు ఏర్పడింది. 5 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు, రికార్డులు, ఫోన్ కాల్స్, 5 వేల మంది వరకు విచారణ చేపట్టారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో మొత్తం 30 మంది పోలీసు అధికారులతో టీం ఏర్పడి.. కరుడుగట్టిన నేరస్తుడిని అరెస్ట్ చేశారు.
ఆ నేరస్తుడిని నుంచి 58 తులాల బంగారం, 97 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడిపై కదిరి సబ్ డివిజన్ పరిధిలో మూడు కేసులు, కర్ణాటకలో 7 కేసులు ఉన్నాయి. మొదట్లో బైక్‌లో పెట్రోల్ దొంగిలించి.. ఆ తర్వాత దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో మర్డర్ చేయడం అలవాటు పడ్డాడు. పోలీసుల విచారణలో దండుపాళ్యం సినిమా చూసే ఇన్‌స్పైర్ అయ్యాయని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు ఇలాంటి సినిమాలు తీస్తే సినీ ఇండస్ట్రీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి