ఎండలు మండిపోతున్నాయి కదా.. అయితే.. ఓ గుడ్‌ న్యూస్.. మే 1 నాటికి తూర్పు భారతంలో ఎండలు తగ్గుతాయట. అలాగే మే 2 నాటికి వాయవ్య, మధ్య భారతదేశంలో వేడి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందట. అంటే మనకు కూడా కాస్త తగ్గుతుంది కదా. అలాగే ఈ వేడి తీవ్రత కారణంగా చాలా రాష్ట్రాల్లో గోధుమ దిగుబడిపై ప్రభావం పడిందట.. దేశంలో 1990 నుంచి 2019 మధ్యకాలంలో వేడి తీవ్రత దాదాపు 15శాతం పెరిగిందని ఐఎండీ చెబుతోంది. అలాగే దేశంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కదా. ఇక దేశ రాజధాని దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచల్ నమోదు అవుతోంది. ఈ చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే నాలుగు రోజుల్లో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందట. ఈ మేరకు మధ్య ప్రదేశ్ , విదర్భ, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: