తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భాజపా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ 8ఏళ్ల పాలనా విజయాలపై బీజేపీ ప్రచారం చేయబోతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయిచింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు జిల్లాల స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తారు.


అలాగే ఈ నెల 16 నుంచి 20 మధ్య జిల్లాల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయిచింది. ఈ నెల 21న గ్రామ, మండలస్థాయిలో సేవాసంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 23న బీజేపీ మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు   నిర్వహించబోతోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP