పాకిస్థాన్ లో షాబాజ్-షరీఫ్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వీరు కొన్నిరోజుల క్రితం పీటీఐ నాయకత్వంలోని ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వాన్ని పడకొట్టారు. అయితే ఇంతలోనే షాబాజ్ ప్రభుత్వానికి కూడా గడ్డు రోజులు దాపురిస్తున్నాయి. షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ అంతటా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. మూడున్నరేళ్లు పాక్ ప్రధానిగా కొనసాగిన ఇమ్రాన్ కొన్ని రోజుల క్రితమే దిగిపోయారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్..


తనను పదవి నుంచి తప్పించేందుకు అమెరికా కుట్ర చేసిందని అప్పట్లో ఇమ్రాన్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి అగ్రరాజ్యం కుట్ర చేసిందని మండిపడ్డారు. ఇక ఇప్పుడు పాక్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ధరలు ఆకాశాన్నంటాయని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ప్రచారం చేస్తోంది. తాజాగా పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ లో భారీ ఆందోళనకు దిగాయి. ఇమ్రాన్ హయాంలోనే ధరలు తక్కువగా ఉండేవని.. ఇప్పుడు సామాన్యులు బతికే పరిస్థితి లేదని అంటున్నారు.  తిరిగి ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: