భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో బిగ్ షాక్ తగిలింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ రోజురోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి మారక విలువ జీవిత కాల కనిష్ఠాన్ని నమోదు చేస్తోంది. డాలర్ విలువ క్రమంగా 80 రూపాయలకు చేరువ అవుతోంది. విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగడం, బలపడిన డాలర్ , అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల రూపాయి క్షీణతకు దారి తీస్తున్నాయి.

ఇలా  రూపాయి క్షీణించడం వల్ల విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇండియా అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. వీటి వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు బాగా దెబ్బతింటాయి. రూపాయి క్షీణత కారణంగా వాటి వృద్ధి తగ్గుతుంది. అయితే.. ఇక్కడ ఓ లాజిక్ ఉంది. ఇండియా వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఐటీ, ఫార్మా వంటి రంగాలు మాత్రం దీనివల్ల లాభం పొందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: