రెండు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు మరో సారి భారీగా పెంచింది.. డీజిల్ ధరలు పెరిగాయని చెబుతూ మరో సారి డీజిల్ సెస్ ను ఆర్టీసీ పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి తొలిసారి అన్ని బస్సుల్లో డీజిల్ సెస్ ను విధించారు. అప్పట్లో బస్ సర్వీసును బట్టి  టికెట్‌పై నిర్ధిష్ట రుసుము నిర్ణయించి డీజిల్ సెస్ విధించారు. సర్వీసులను బట్టి కనిష్టంగా 5రూపాయలు గరిష్టంగా 10 రూపాయలు మాత్రమే సెస్‌ ఉండేది. ఇకపై టికెట్ పై కాకుండా  ప్రయాణించే దూరాన్ని డీజిల్ సెస్ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూరాన్ని బట్టి కనిష్టంగా 10 రూపాయలు... గరిష్టంగా 140 రూపాయల వరకూ డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. బేసిక్ చార్జి, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రకారం మొత్తం చార్జీని నిర్ణయించిన ఆర్టీసీ... ఈ మేరకు వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది.  దూరం పెరిగే కొద్దీ టికెట్ చార్జీ భారీగా పెరగనుంది. వీటితో పాటు కనీస బస్సు చార్జీలనూ ఆర్టీసీ పెంచింది. ప్రయాణికులకు గతంలో కంటే ఈసారి భారీగా భారం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: