కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించటాన్ని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా తప్పుబట్టారు. దీనివల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ధూళిపాళ్ల నరేంద్ర  అన్నారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన దాణా చట్టం ద్వారా ధరలు పెరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర  అన్నారు. అలాగే కరెంటు ఛార్జీల పెంపు, డీజిల్ ధరల పెంపు కారణంగా డెయిరీలపై నిర్వహణా భారం పెరిగిందని ధూళిపాళ్ల నరేంద్ర  వివరించారు. ప్రభుత్వ విధానాలపై కోర్టుని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర  తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాతో సహకార డెయిరీలపై రోజురోజుకీ ఆర్థిక భారం పెరుగుతోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూలిపాళ్ల నరేంద్ర అన్నారు. అముల్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార డెయిరీలను ఇబ్బందులకు గురిచేస్తోందని నరేంద్ర ఆరోపించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన డెయిరీ సర్వ సభ్య సమావేశంలో ధూలిపాళ్ల నరేంద్ర  పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: