T 20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమితో, మరోసారి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. దీంతో అద్భుతంగా ఆడిన ఇంగ్లండ్ జట్టు నవంబర్ 13 వ తేదీన పాక్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.ఇక టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి, 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం వికెట్ నష్టపోకుండా ఆ టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది. 

ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా బౌలర్లపై చాలా భీకరంగా దాడి చేశారు. ఈ క్రమంలో హేల్స్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేసి, ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇంకా అలాగే మరో ఎండ్ నుంచి ఇంగ్లండ్ కెప్టెన్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఎన్నో అంచనాలతో సెమీస్ చేరిన టీమిండియాకు మరోసారి ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టే పరిస్థితి నిజమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: