ఏపీలో.. ప్రత్యేకించి కోస్తాంధ్రలో ఆక్వా ఉత్పత్తిదారులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనం అవుతున్నాయి. దీంతో సర్కారు చర్యలు చేడుతోంది. అయితే.. ఆక్వా సిండికేట్ దారులంతా చంద్రబాబు శిష్యులేనని.. ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా.. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

ఆక్వా  సిండికేట్‌ వ్యవస్థల్లోని వారంతా చంద్రబాబు శిష్యులేనని..  వారంతా సిండికేట్‌  అయ్యి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా తాము వెనకడుగు వేసేది లేదని అంటున్నారు.  ఈ నెల 21న నరసాపురానికి సిఎం వైయ‌స్‌ జగన్‌ గారు వస్తున్నారని... అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారని చెబుతున్నారు. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరిస్తున్నారు. అయితే సమస్య ఏదైనా చంద్రబాబే కారణం అనడం కూడా కరెక్టు కాదేమో.. వైసీపీ నేతలు ఆలోచించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: