ఉత్తరాఖండ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద్ భారత్‌-అమెరికా సంయుక్తంగా సాగిస్తున్న యుద్ధ విన్యాసాలు చైనా గుండెల్లో దడ పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఇలా భారత్‌-అమెరికా యుద్ధ విన్యాసాలు చేయడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. అయితే.. ఇలా సైనిక విన్యాసాలు చేయడం ఆయా దేశాల విధానాల్లో భాగంగా జరుగుతుంది. ఇలాంటి విన్యాసాల విషయంలో చైనా తలదూర్చడాన్ని అమెరికా తప్పుబట్టింది.

చైనా తీరును తప్పుబట్టిన అమెరికా దౌత్యవేత్త ఎలిజెబెత్‌ జోన్స్... భారత్, అమెరికా మధ్య వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయని అన్నారు. ఇరుదేశాల మధ్య 157 బిలియన్ డాలర్ల వర్తకం జరుగుతోందని  జోన్స్ గుర్తు చేశారు. అదే సమయంలో యుద్ధ విన్యాసాలపై చైనా అభ్యంతరాన్ని భారత్ తోసి పుచ్చింది. తమకు నచ్చిన దేశంతో యుద్ధ విన్యాసాలు చేసే హక్కు తమకు ఉందంటూ భారత్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని వాస్తవాధీన రేఖ యుద్ధ అభ్యాస్ పేరిట జరగుతున్న సైనిక విన్యాసాలు రెండు వారాల పాటు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: