మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ పేరుతో ఆశలు చూపించారు.. భారీగా డబ్బు కొల్లకొట్టారు. అలా భారీగా మోసపోయిన బాధితులు న్యాయం చేయాలని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసి చాలా రోజులు గడుస్తున్నా ట్రేడింగ్ యజమానులను పట్టుకోక పోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25వేల మంది నుంచి సుమారు 5వేల కోట్లు వసూళ్లు చేశారు. ట్రేడింగ్ లో భారీగా లాభాలు తెస్తామని... అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి కార్యాలయాన్ని మూసివేశారన్నారు.

ట్రేడింగ్ సంస్థ యజమానులకు ఫోన్ చేసి అడిగితే తాము దుబాయ్ లో ఉన్నామని... తమ వెనుక దుబాయ్ షేక్ లు ఉన్నారని ఇన్వెస్టర్లకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులు చేసి... ఇంట్లో బంగారం అమ్మి, మరికొంత మంది అప్పు చేసి ఒక లక్ష నుంచి 20లక్షల వరకు కట్టినట్లు బాధితులు తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని... దుబాయ్ నిందితులు ఖాలేద్, అమర్ హుస్సేన్‌ను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: