హార్ట్‌ఫుల్‌నెస్ శ్రీ రామ్ చంద్ర మిషన్ ఆది గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి వేడుకలను ఇవాళ్టి నుంచి శంషాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో ఘనంగా నిర్వహించనున్నారు. లాలాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటీ కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సుమారు లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.


మ్యూజిక్ ఫెస్టివల్ లో భాగంగా అంతర్జాతీయ  స్థాయిలో ప్రసిద్ధ కళాకారులైన రాహుల్ శర్మ, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ రషీద్ ఖాన్, సుధా రఘునాథన్, శశాంక్ సుబ్రమణ్యం, కౌషికి చక్రవర్తి, సంజీవ్ అభ్యంకర్ తమ సంగీతంతో అలరించనున్నారు. ఈ ఆధ్యాత్మిక ఆనందంలో అవకాశం ఉంటే.. మీరూ పాలుపంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: