తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా ఖరారు అయ్యింది. అందువల్ల అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. నిర్ధేశిత గడువులోగా బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేయాలి. 18వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్ ల ముద్రణ పూర్తి కావాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు.


పెరిగిన ఓటర్లకు అనుగుణంగా 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కు చేరుకుంది. ప్రతి జిల్లాకు ఓట్ల లెక్కింపు కేంద్రంకౌంటింగ్ సెంటర్ కు కూడా ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. నామినేషన్ల ఆమోదం, తిరస్కరణకు సంబంధించి ఆర్ఓ లపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: