బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని  కొనసాగించేది ఎవరు? బెయిల్ పై ఇటీవల విడుదల అయిన ఆప్ జాతీయ కన్వీనర్ , దిల్లీ సీఎం కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే ప్రధాని మోదీపై అసంతృప్తి పెరుగుతుందని.. దీంతో మోదీ వారసుడు ఎవరు అనే దానిపై బీజేపీలోను చర్చ మొదలైందని బ్రిటీష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకనమిస్ట్ ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది.


మోదీ వల్ల బీజేపీ నష్టమే అని పేర్కొన్న వార్తా పత్రిక దానికి గల కారణాలను విశ్లేషించింది. అలాగే మోదీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది. అయితే ఫలానా అని ఆ మేగజైన్‌ ఎవరినీ తేల్చలేదు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో బెయిల్ పై విడుదల అయిన అరవింత్ కేజ్రీవాల్ వస్తూ వస్తూనే ఆసక్తికర చర్చకు తెరలేపారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని సాగనంపే సంప్రదాయం ఉందని ఈ కారణం చేతనే.. మురళీ మనోహర్ జోషి, ఎల్ కే ఆడ్వాణీ, వెంకయ్య నాయుడు, సుమిత్రా మహజన్ లను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: