
శాలిమర్ గార్డెన్ ఏరియాకు చెందిన 12 ఏళ్ల బాలికను ఇటీవలే తల్లిదండ్రులు ఏదో విషయం పై మందలించారు. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న బాలిక ఏకంగా తండ్రి కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టింది. కోటి రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. లేకపోతే కుమారుడు కుమార్తె ను చంపేస్తాము అంటూ బెదిరింపులకు సైతం పాల్పడింది. అయితే ఇక ఆ బెదిరింపులతో కంగారు పడిపోయిన తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఆ తర్వాత పోలీసు విచారణలో ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి కి మెసేజ్ చేసింది ఎవరో కాదు ఏకంగా 12 ఏళ్ళ కూతురు అన్న విషయం తెలిసింది.
కాగా ఇక కూతురు చేసిన పనికి తండ్రి ఖంగు తినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి తండ్రి మొబైల్ వాట్సాప్ స్టేటస్ లో అసభ్యకరమైన పదాలు ఉంచుతూ ఉంది కూతురు. ఇదేంటి అని ప్రశ్నిస్తే నాకు తెలియదు ఫోన్ హ్యాక్ అయినట్లు ఉంది అంటూ అబద్ధాలు చెబుతూ వచ్చింది. ఇక ఇటీవలే పోలీసు విచారణలో అన్ని విషయాలు బయట పడడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇచ్చినప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని ఇక పూర్తిగా మొబైల్ ఇచ్చి వదిలేస్తే వాళ్లు పెడదోవ పట్టే అవకాశం ఉంది అని అటు తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.